(ఈ ఫొటోలను వాడుకోవడం కేవలం విజువల్ ఎఫెక్ట్ కోసం మాత్రమే)
చిన్నపిల్లలకి లాల పోసి, లాలించి, జోలపాడి, నిద్ర పుచ్చటం , ఏడుస్తుంటే భుజం మీద వేసుకొని జోకొడుతూపాడడం ఇలా చాలా రకాల పాటలున్నయి. ఫూర్వం రాముడుమీద - రామా లాలీ, దశరధ తనయాలాలీ, , కృష్ణుడుమీద జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద లాలి గోవిందా లాలీ ....... లాంటి
పాటలు
మనకి
తెలుసు. నే రాస్తున్నది వదిన మరదళ్ళు, కుటుంబం గుఱించి వేళాకోళం జోలపాట:
ఏడవకు ఏడవకు వెర్రినా తల్లీ (లేక వెర్రినాతండ్రి)
ఏడుస్తే నీ కళ్ళు నీలాలు
కారు,
నీలాలు కారితే
నే చూడలేను
పాలైన కారవా బంగారు కళ్ళా | | ఏడవకు ఏడవకు . . . .||
చిన్నరి పొన్నారి చిలకవే నువ్వు
చిగురు మామిడికింద చిన్న కోయిలవు
అమ్మాయి మామాల్లు(మామలు) ఎటువంటివారు
గుండు పోగులవారు గుఱ్ఱాలవారు,
హంసల్లు మా యింటి ఆడపడుచుల్లు
కోకిల్లు మాయింటి కొత్త కోడళ్ళు | | ఏడవకు ఏడవకు . . . . ||
చిన చెరువు
పెద చెరువు ఏమి కోరింది
నెల మూడు వర్షాలు కురియకోరింది
ఉళుళువ హాయీ, హాయీ హయీ ఆపదలు కాయి ఉళుళువ హాయీ
Vadinaa maradaLLa vELaakOLam jOlapaaTa
chinnapillalaki laala pOsi, laalinchi jOlapaaDi nidra
puchchaTam , EDustunTae bhujam meeda vaesukoni jOkoDutoo paaDaDam ilaa chaalaa
rakaala paaTalunnayi. Poorvam raamuDumeeda - raamaa laalee, daSaradha
tanayaalaalee, , kRshNuDumeeda jO achyutaananda jOjO mukundaa laali paramaananda
laali gOvindaa laalee .......laamTi paaTalu manaki telusu. nae raastunnadi
vadina maradaLLu, kuTumbam gurinchi vaeLaakOLam jOlapaaTa:
EDavaku EDavaku verrinaatallee (laeka verrinaatanDri)
EDustae nee kaLLu neelaalu kaaru
neelaalu kaaritae nae chooDalaenu
paalaina kaaravaa bangaaru kaLLaa | |
EDavaku EDavaku ||
chinnari ponnaari chilakavae nuvvu
chiguru maamiDikinda chinna kOyilavu
ammaayi maamaallu (maamalu) eTuvanTivaaru
gunDu pOgulavaaru gu~r~raalavaaru,
kOkillu maayinTi kotta kODaLLu | | EDavaku EDavaku . . ||
china cheruvu peda cheruvu Emi kOrindi
nela mooDu varshaalu kuriyakOrindi
uLuLuva haayee, haayee hayee aapadalu kaayi
uLuLuva,haayee

సుగునక్కా చాలా బాగా రాసేవు! ఇలాగే ఇంకా ఇంకా రాయాలి!కలాన్ని మరి ఆపకు! నీ అనుభవాలు అందరికి పనికివస్థాయి! ఫ్రేంబాబు
ReplyDeleteGo on Sugunakka. ...great..
DeleteEdavaku lavakumara...kuda rayi...Valmiki aashramam lo vundaga Seetamma padina pata.