Sunday, September 21, 2014

భూమి గుండ్రంగా ఉంది




అది 1947 స్వతంత్రం రాక ముందు జూలై లో అనుకుంటాను  మా నాన్నగారు డిల్లీలో నన్ను సైకిలుమీద కూర్చోపెట్టుకుని (అప్పుడు నాకు పదేళ్ళు) రాష్ట్రపతి భవన్పార్లమెంట్ హౌస్ఇండియా గేట్  అవీ చూపించి మనకి ఆగస్ట్ పదిహేను న  ఇండిపెండెన్సు వస్తుంది అన్నారు. నేను అంటే ఏమిటి అని అడిగే ను. దానికి జబాబుగా ఇన్నాళ్ళు బ్రిటిష్ వాళ్ళు రాజ్యం ఏలేరు. ఇప్పుడు మనకి స్వతంత్రం వస్తుంది. ఆగస్ట్ 15 కి బ్రిటిష్ జెండా తీసి మన కాంగ్రెస్ జెండా పెడతారు అని చెప్పేరు.
        వారం తర్వాత మా ఇంటికి ముగ్గురు నలుగురు స్నేహితులు వచ్చేవారు. ఇంట్లో కొన్ని కార్యక్రమాలకి రిహార్సల్స్ జరిగేవి. నేను, మా తమ్ముడు ప్రేంబాబు ఒక నాటకంలో కుటుంబంలో పిల్లలు. ఇది కాక మా చేత శ్రీ లు పొంగిన జీవగడ్డ యిది అని - - - పాట పాడుర తమ్ముడా ? వేదశాస్త్రములున్నవిచట, ఆది కావ్యములందె నిచ్చట , బాదరాయణ పరమ ఋషులకి - - - పాటపాడవె చెల్లెలా అని చాలా గీతాలు నేర్పేరు .67 సంవత్సరాలు క్రిందటివి కదా పాటలు జ్ఞాపకము లేవు. అవన్నీ స్వాతంత్ర దినోత్సవం కోసమే.
        ఎదురు చూసిన స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. మేము పార్లమెంట్ భవనం దగ్గర లార్డ్ మౌంట్ బేటన్. నెహ్రు అందర్నీ చూసేము. ఆంద్ర అస్సొసియేషన్ తరఫున ప్రోగ్రాం కి గ్రీన్ రూమ్ లో మా అందరికి మేకప్ చేస్తున్నారు. చాలా మందున్నారు. అందులో ఒక అమ్మాయికి
భారతమాత వేషం వేస్తున్నారు. ఆ అమ్మాయి వయసులో చిన్నది, సన్నజాజి మొగ్గ లా వుంది. ఎవరా ? అని వింతగా చూసేము. ఆ ప్రోగ్రాం లో మా నాన్నగారు, ఇంకో ఆయన రాఘవేoద్రరావుగారని -  ఆయన పొట్టిగా ఉండేవారు. వీళ్ళిద్దరూ ఒరిస్సాలో ఉండే కోయ వాళ్ళ నృత్యం డప్పుల లయతో ఒళ్ళంతా మసి పూసుకొని, పూసలు గవ్వల నగలు,తలకి పక్షి ఈకలతో టోపీలాగ అన్నింటికంటే ముఖ్యం ఆడ మగ వేషంలో  మా నాన్నగారు మగవేషం  గోచీ పెట్టుకొని నృత్యం చేసేరు. వేదిక మీదకి  రాగానే ఆ వేష ధారణ చూసి గోల, ఈల, చ ప్పట్లు. ఇలా స్వాతంత్ర దినోత్సవం ముగిసింది.
        తరువాత రెండు మూడు నెలలకి హిందూ ముస్లింల అల్లరులు మొదలైనాయి. కర్ఫ్యూ - - - తినడానికి ఎం దొరక్క  కర్ఫ్యూసడలించగానే మా నాన్నగారు మమ్మల్ని మా అమ్మమ్మగారింటికి శ్రీకాకుళం పంపించేసేరు. అక్కడ మేము 1949 వరకు ఉన్నాము. స్కూలు, చదువు అంతా అక్కడే. ఈ లోగా మా పెద్దమామ పెళ్లి కుదిరింది. పెళ్లి సింహాచలంలో. బస్సులో  పెళ్లివారం వెళ్లేము. ఆ పెళ్ళిలో డిల్లీలో స్వాతంత్ర దినోత్సవంలో చూసిన భారతమాత ప్రత్యక్షం! ఎవరా అని ఒకరి నొకరు చూసుకున్నాము. తరువాత డిల్లీ చేరుకున్నాక ప్రతీ తెలుగు ప్రోగ్రాముల్లో భరతమాతని కలుసుకునేవాళ్ళము. ఆవిడెవరనుకున్నారు  ? ప్రఖ్యాత తెలుగు న్యూస్ రీడర్ పన్యాల రంగానాధరావుగారి భార్య సర స్వతి (సరు). పన్యాల రంగానాధరావుగారి చెల్లెలే పెళ్ళికూతురు  మా అత్త. ఆ రోజుల్లో ఆలిండియా రేడియో తెలుగులో వార్తలు -  చదువుతున్నది పన్యాల రంగానాధరావుగారు అని వింటుండే వారము. ఇలాగే జగ్గయ్యగారు, వారణాసి సుబ్రహ్మణ్యం గారు వగైరాలు. డిల్లీ నుంచే అన్ని భాషల వార్తలు వచ్చేవి. వారూ హీరోల్లాగే ఉండేవారు. ఆ తరువాత చాలా సంవత్సరాలు ప్రతి ఫంక్షన్ కి కలుస్తుండే వారము. ఇళ్ళకి రాక పోకలు. అలా ఉత్తర  దేశంలో  స్థిరనివాసం అయింది.   రాజా (హాసం) తండ్రి నాకు మేనమామ. రాజాకి పన్యాల రంగానాధరావు మేనమామ.

Thursday, April 10, 2014

మొగుడు కావాలి





ఏమిటండీ అలా చూస్తున్నారు
నాకు మొగుడు కావాలనుకుంటున్నారా ?
కాదండోయ్ - నాకు మొగుడున్నాడు
నే చెప్పేది మొగుడు కావాలి  చిరంజీవి సినిమా –‘మొగుడు కావాలిగురించి

మేము Nagpur లో నలభై అయిదు సంవత్సరాలుగా ఉన్నాము. అక్కడ తెలుగు సినిమాలు అంతగా వచ్చేవికావు. వచ్చినా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి వేసేవారు. అలాగే వెళ్ళివారం. తరువాత అదీ పోయి కేసెట్లు అద్దెకి వచ్చేయి. తరువాత CDలు.
పందొమ్మిదివందల తొంభైలో ఒక పెళ్ళికి నేనొక్కర్తినే ఆంధ్రా వచ్చేను. అలా ఆంధ్రా వచ్చినపుడు ఆబగా రెండు మూడు సినిమాలు చూసేవాళ్ళం. Nagpur చేరేక స్నేహితుల మొదటి ప్రశ్న తెలుగు సినిమాలు చూసేరా ? ఏం సినిమాలు చూసేరు ? ‘అని ఒకరినొకరు అడగటం పరిపాటి. అలా అడిగేక నేను చూసిన సినిమాల పేర్లు చెప్పడానికి చాలా సిగ్గేసింది.). నే చూసిన సినిమాలు ఏమిటంటే "మొగుడు కావాలి". అందులో చిరంజీవి, గాయిత్రి, రెండో సినిమా "యవ్వనం కాటేసింది". చూసినప్పుడు ఏమీ అనిపించలే. కాని ఎవరికేనా పేరు చెప్పేటప్పుడు చచ్చేదాన్ని.
ఆ రోజుల్లో మేము సంక్రాంతి పండగకి తెలుగు స్నేహితులం కలసి -  పిల్లలు, పెద్దలు కలిసి సాంస్కృతి కార్యక్రమాలు చేసి, చేయించి పండగ జరుపుకొనేవారము . విశాఖపట్నం లో వీధి కొళాయిల దగ్గర నీళ్ళ బిందెలు పట్టుకుందికి ఆ వీధి వాళ్ళు వచ్చేవారు. వాళ్ళ మాట, భాష, దెబ్బలాటలు నిత్యం జరిగేవి. కొళాయి దగ్గర చూసేక .’మొగుడు కావాలి సినిమా చూసేక,  నేను కల్పించి రాసిన స్కిట్ ని stageమీద నేను ఇంకో ఆవిడ (విజయలక్ష్మి) కలసి వేసేము.
ఈ సంక్రాంతి సంబరాలు చేయటానికి ముఖ్య కారకురాలు, నా స్నేహితురాలు, మా పిల్లలకి ఇంగ్లీషు టీచరు. ఆవిడ school  పిల్లల్ని మాయింటికి పంపిస్తే రోజూ రిహార్సులు ! ఆవిడ పేరు బాలారావు. ప్రతీ సందడికీ మేము కలసేవారం. ప్రస్తుతం వృద్ధాప్యంతో ఏడాదిలా అన్నీ మానేసేము. అవే కాక ముప్పై ఏళ్లుగా కిట్టీ పార్టీ 50 రూపయలతో ప్రారంభించి 2 వేలు నెలకి వేసుకొని అంతా కలిసేవాళ్ళం. ఏడాదయి అదీ లేదు. స్కిట్ ఇదే :

 -      -     -    -     -     -                              
అప్పలకొండ (వస్తూ)  :
ఓలప్పా, అప్పా, లచ్చప్పా, ఏటి సేతున్నావ్ పనవనేదా ? పని అయిపోనాదే లచ్చప్పా 
లచ్మి :
ఏటియాల ఇలా పారొచ్చినావ్ అప్పలకొండా
అబ్బ ! అప్పలకొండా ఏటి, పూరితి పేరుతో పిలవాల ఏటి - - - అప్పూ అని పిలు బాగుంటది.
అప్పా సిరంజీవి సినేమా వచ్చినాది - మేట్నీకి ఎల్దామని పదయే -
మేట్నీయా ఏటే ? పనికాకుంటే !? - నా బావకి సెప్పాలికదా . .
ఆ ఏం తెలుసుద్దిట బావకి - వెల్లిపుచ్చేస్తాము కదప్పా -
ఏ సినీమాయే
మొగుడుకావాలి.
ఏటీ ఉన్న మొగుడుసాల్లేదేటే - మొగుడుకావాలంతున్నావ్
వల్లకోయే అప్పా  నానేతన్నాను ?
సినీమా. మొగుడు కావలి అని.
సర్నేయే పరాసికాలు.

అని తొందరపెట్టి యిద్దరూ కబుర్లు సెప్పుకుంటూ సినీమాకెల్లేరు.
మర్నాడు ప్రొద్దున్నే కొళాయి దగ్గర చాలా బిందెలు ముందు నానంటే నాను అని తోపులాట.
యింతలో అప్పలకొండ అనే అప్పూ మొకం వాచి, జుత్తు రేగి ఉన్న ముఖంతో నాను ముందట్టుకోవాల నీళ్ళు ‘  అని బిందె తీసి కొళాయి కింద పెట్టింది. దాంతో అందరూ టే ముందు నువ్వట్టుకోవాలే నీళ్ళు యెనక్కెల్లు అని ఒక్క తోపు తోసేరెవరో !
ఓలమ్మో సచ్చిపోనాన్రోయ్ - నీ జిమ్మడ –‘ ఈ లోగా నిన్నటి లచ్మి వచ్చింది.
ఏదీ నా బిందె ఈడ లయినులో పెట్టి ఎల్లినాను - ఏదీ ? ’ అంటూ.

ఏటే లయాన్ అంటనావు. నాకసలే సిరాగ్గుంది, జొరం వచ్చింది నన్నట్టుకోనీయే నీళ్ళు ముందు
అదేం కుదరదు
ఏటే పేల్తున్నావ్ ఈ కొలాయి నీ బాబు కట్టించాడేటి? ‘
అవునే నా బాబే కట్టించాడు ఏటంటావ్
అవున్లేయే ఊరంతా నీ బాబులే ! వొల్లకోయే
ఏటి కూసేవ్?  ’
యిద్దరూ మీదమీదకు వచ్చి జుట్టు జుట్టు పట్టుకొని (శిఖపట్ల కాండ)
నీ వంసం నా కెరికె - ఏటనుకున్నావ్ . . . .అంటూ పోట్లాట  (ముందు రోజు కలిసి సినిమాకెళ్ళీన స్నేహం అంతా హుష్ కాకి అయిపోయింది.)
అందరూ ఇద్దర్నీ విడిపిస్తారు - ఈలోగా నీళ్ళు బందు - మిగతా వాళ్ళ బిందెలు నిండు !
                                        ఆ రోజు సాయంత్రం.
అప్పూ వాచిన ముఖం చూసిన లచ్చి  ఏటయినాది అప్పూ –?’ అడిగింది...
(మళ్ళీ స్నేహాలు  మొదలు)  
ఏం లేదప్పానిన్న మనం సినీమాకెల్లాక నా మామ బస్సందక తిరిగొచ్చినాదంట. యిల్లు తాలం సూసి సివాలెత్తిపోయి సెట్టుకింద కూకున్నాడు. నేనొచ్చి తాలం తీసి గుడిసెనోకి ఎల్లడమేటి - మామ నా జుట్టుట్టకొని ఎటెల్లినయే . . పెత్తనాలకి, అని వొల్లు కుల్లబొడిసేడు దొంగసచ్చినోడు. ఏటి సేత్తునప్పా! అని యిద్దరూ కావటేసుకొని ఏడుపు. వల్లకోయే అప్పలకొండా ఏటి సేత్తాం ! మనబతుకులింతే.

(విశాఖలో కొళాయి దగ్గర నిత్యం రకరకాల తిట్లు, శిఖపట్లు, బిందెలు విసురుకోటం ఆ రోజుల్లో జరిగేవి.) 
(అటుపక్క కొంతమంది మొగుడ్ని బావ అని, మామ అని, అక్కకి అప్ప అని అంటారు -)
                                         moguDu kaavaali  
 aemiTaMDee alaa choostunnaaru – 
naaku moguDu kaavaalanukuMTunnaaraa ? 
kaadaMDOy^ - naaku moguDunnaaDu – 
nae cheppaedi ‘moguDu kaavaali’  chiraMjeevi sinimaa –‘moguDu kaavaali’ guriMchi

maemu Nagpur lO nalabhai ayidu saMvatsaraalugaa unnaamu. akkaDa telugu sinimaalu aMtagaa vachchaevikaavu. vachchinaa aadivaaraM udayaM tommidi gaMTalaki vaesaevaaru. alaagae veLLivaaraM. taruvaata adee pOyi kaeseTlu addeki vachchaeyi. taruvaata CDlu. 
paMdommidivaMdala toMbhailO oka peLLiki naenokkartinae aaMdhraa vachchaenu. alaa aaMdhraa vachchinapuDu aabagaa reMDu mooDu sinimaalu choosaevaaLLaM. Nagpur chaeraeka snaehitula modaTi praSna ‘telugu sinimaalu choosaeraa ? aeM sinimaalu choosaeru ? ‘ani okarinokaru aDagaTaM paripaaTi. alaa aDigaeka naenu choosina sinimaala paerlu cheppaDaaniki chaalaa siggaesiMdi.). nae choosina sinimaalu aemiTaMTae "moguDu kaavaali". aMdulO chiraMjeevi, gaayitri, reMDO sinimaa "yavvanaM kaaTaesiMdi". choosinappuDu aemee anipiMchalae. kaani evarikaenaa paeru cheppaeTappuDu chachchaedaanni. 
aa rOjullO maemu saMkraaMti paMDagaki telugu snaehitulaM kalasi -  pillalu, peddalu kalisi saaMskRtika kaaryakramaalu chaesi, chaeyiMchi paMDaga jarupukonaevaaramu . viSaakhapaTnaM lO veedhi koLaayila daggara neeLLa biMdelu paTTukuMdiki aa veedhi vaaLLu vachchaevaaru. vaaLLa maaTa, bhaasha, debbalaaTalu nityaM jarigaevi. koLaayi daggara choosaeka .’moguDu kaavaali’ sinimaa choosaeka,  naenu kalpiMchi raasina O skiT^ ni stagemeeda naenu iMkO aaviDa (vijayalakshmi) kalasi vaesaemu. 
ee saMkraaMti saMbaraalu chaeyaTaaniki mukhya kaarakuraalu, naa snaehituraalu, maa pillalaki iMgleeshu Teecharu. aaviDa school  pillalni maayiMTiki paMpistae rOjoo rihaarsulu ! aaviDa paeru baalaaraavu. pratee saMdaDikee maemu kalasaevaaraM. prastutaM vRddhaapyaMtO aeDaadilaa annee maanaesaemu. avae kaaka muppai aeLlugaa kiTTee paarTee 50 roopayalatO praaraMbhiMchi 2 vaelu nelaki vaesukoni aMtaa kalisaevaaLLaM. aeDaadayi adee laedu. aa skiT^ idae : 

 -      -     -    -     -     -                               
appalakoMDa (vastoo)  : 
Olappaa, appaa, lachchappaa, aeTi saetunnaav^ panavanaedaa ? pani ayipOnaadae lachchappaa  
lachmi : 
aeTiyaala ilaa paarochchinaav^ appalakoMDaa 
abba ! appalakoMDaa aeTi, pooriti paerutO pilavaala aeTi - - - appoo ani pilu baaguMTadi. 
appaa siraMjeevi sinaemaa vachchinaadi - maeTneeki eldaamani padayae -
maeTneeyaa aeTae ? panikaakuMTae !? - naa baavaki seppaalikadaa . . 
aa aeM telusuddiTa baavaki - vellipuchchaestaamu kadappaa -
ae sineemaayae 
moguDukaavaali. 
aeTee unna moguDusaallaedaeTae - moguDukaavaalaMtunnaav^
vallakOyae appaa  naanaetannaanu ? 
sineemaa. moguDu kaavali ani.
sarnaeyae paraasikaalu.

ani toMdarapeTTi yiddaroo kaburlu seppukuMToo sineemaakellaeru.
marnaaDu proddunnae koLaayi daggara chaalaa biMdelu – ‘muMdu naanaMTae naanu’ ani tOpulaaTa. 
yiMtalO appalakoMDa anae appoo mokaM vaachi, juttu raegi unna mukhaMtO ‘naanu muMdaTTukOvaala neeLLu ‘  ani biMde teesi koLaayi kiMda peTTiMdi. daaMtO aMdaroo ‘aeTae muMdu nuvvaTTukOvaalae neeLLu – yenakkellu’ ani okka tOpu tOsaerevarO ! 
‘OlammO sachchipOnaanrOy^ - nee jimmaDa –‘ ee lOgaa ninnaTi lachmi vachchiMdi. 
‘aedee naa biMde eeDa layinulO peTTi ellinaanu - aedee ? ’ aMToo.

‘aeTae layaan^ aMTanaavu. naakasalae siraagguMdi, joraM vachchiMdi nannaTTukOneeyae neeLLu muMdu’ 
‘adaeM kudaradu ‘ 
‘ aeTae paeltunnaav^ ee kolaayi nee baabu kaTTiMchaaDaeTi? ‘
‘avunae naa baabae kaTTiMchaaDu – aeTaMTaav^’ 
‘avunlaeyae ooraMtaa nee baabulae ! vollakOyae’ 
‘aeTi koosaev^?  ’
yiddaroo meedameedaku vachchi juTTu juTTu paTTukoni (SikhapaTla kaaMDa) 
‘nee vaMsaM naa kerike - aeTanukunnaav^ . . . .’ aMToo pOTlaaTa –  (muMdu rOju kalisi sinimaakeLLeena snaehaM aMtaa hush^ kaaki ayipOyiMdi.)
aMdaroo iddarnee viDipistaaru - eelOgaa neeLLu baMdu - migataa vaaLLa biMdelu niMDu ! 
                                        aa rOju saayaMtraM.
appoo vaachina mukhaM choosina lachchi  ‘aeTayinaadi appoo –?’ aDigiMdi... 
(maLLee snaehaalu  modalu)   
‘aeM laedappaaninna manaM sineemaakellaaka naa maama bassaMdaka tirigochchinaadaMTa. yillu taalaM soosi sivaalettipOyi seTTukiMda kookunnaaDu. naenochchi taalaM teesi guDisenOki ellaDamaeTi - maama naa juTTuTTakoni eTellinayae . . pettanaalaki, ani vollu kullaboDisaeDu doMgasachchinODu. aeTi saettunappaa!’ ani yiddaroo kaavaTaesukoni aeDupu. ‘vallakOyae appalakoMDaa aeTi saettaaM ! manabatukuliMtae. ‘

(viSaakhalO koLaayi daggara nityaM rakarakaala tiTlu, SikhapaTlu, biMdelu visurukOTaM aa rOjullO jarigaevi.)  
(aTupakka koMtamaMdi moguDni baava ani, maama ani, akkaki appa ani aMTaaru -



Wednesday, April 2, 2014

వదినా మరదళ్ళ వేళాకోళం జోలపాట



                            ( ఫొటోలను వాడుకోవడం  కేవలం విజువల్ ఎఫెక్ట్ కోసం మాత్రమే

చిన్నపిల్లలకి లాల పోసి, లాలించి, జోలపాడి, నిద్ర పుచ్చటం , ఏడుస్తుంటే భుజం మీద వేసుకొని జోకొడుతూపాడడం ఇలా చాలా రకాల పాటలున్నయి. ఫూర్వం రాముడుమీద - రామా లాలీ, దశరధ తనయాలాలీ, , కృష్ణుడుమీద  జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద లాలి గోవిందా లాలీ ....... లాంటి పాటలు మనకి తెలుసునే రాస్తున్నది  వదిన మరదళ్ళు, కుటుంబం గుఱించి వేళాకోళం జోలపాట

   ఏడవకు ఏడవకు వెర్రినా తల్లీ  (లేక వెర్రినాతండ్రి)
   ఏడుస్తే నీ కళ్ళు నీలాలు కారు,
   నీలాలు కారితే నే చూడలేను
   పాలైన కారవా బంగారు కళ్ళా | | ఏడవకు ఏడవకు . . . .||
   చిన్నరి పొన్నారి చిలకవే నువ్వు
   చిగురు మామిడికింద చిన్న కోయిలవు
   అమ్మాయి మామాల్లు(మామలు)  ఎటువంటివారు
   గుండు పోగులవారు గుఱ్ఱాలవారు,
   హంసల్లు మా యింటి ఆడపడుచుల్లు 
   కోకిల్లు మాయింటి కొత్త కోడళ్ళు |  | ఏడవకు ఏడవకు . . . . ||
   చిన చెరువు పెద చెరువు ఏమి కోరింది
   నెల మూడు వర్షాలు కురియకోరింది

   ఉళుళువ హాయీ, హాయీ హయీ ఆపదలు కాయి ఉళుళువ హాయీ     


            Vadinaa maradaLLa vELaakOLam jOlapaaTa

chinnapillalaki laala pOsi, laalinchi jOlapaaDi nidra puchchaTam , EDustunTae bhujam meeda vaesukoni jOkoDutoo paaDaDam ilaa chaalaa rakaala paaTalunnayi. Poorvam raamuDumeeda - raamaa laalee, daSaradha tanayaalaalee, , kRshNuDumeeda jO achyutaananda jOjO mukundaa laali paramaananda laali gOvindaa laalee .......laamTi paaTalu manaki telusu. nae raastunnadi vadina maradaLLu, kuTumbam gurinchi vaeLaakOLam jOlapaaTa: 

   EDavaku EDavaku verrinaatallee  (laeka verrinaatanDri)
   EDustae nee kaLLu neelaalu kaaru
   neelaalu kaaritae nae chooDalaenu
   paalaina kaaravaa bangaaru kaLLaa | | EDavaku EDavaku  ||
   chinnari ponnaari chilakavae nuvvu
   chiguru maamiDikinda chinna kOyilavu
   ammaayi maamaallu (maamalu) eTuvanTivaaru
   gunDu pOgulavaaru gu~r~raalavaaru,
   hamsallu maa yinTi aaDapaDuchullu 
   kOkillu maayinTi kotta kODaLLu |  | EDavaku EDavaku . . ||
   china cheruvu peda cheruvu Emi kOrindi
   nela mooDu varshaalu kuriyakOrindi
   uLuLuva haayee, haayee hayee aapadalu kaayi 
   uLuLuva,haayee     

Wednesday, March 26, 2014

డెబ్బై ఏళ్ల క్రిందట నేను విన్న జానపదాలు -1



                   

          చిన్నప్పుడు శ్రీకాకుళంలోని  మా అమ్మమ్మగారింట్లో మా అమ్మ ఒక చిన్న పని కుర్రవాడిని - చిన్నపిల్లల్ని ఆడించడానికి, తిప్పడానికి ఉయ్యాలలో వేసి ఊపడానికి - పెట్టుకుంది.  ఆ కుర్రాడు పల్లె పదాలు పాడుకుంటూ  సరదాగా ఉండేవాడు.కర్ర చక్క మీదో, కుర్చీమీదో దరువేస్తూ పాడేవాడు.
నేనూ చిన్నదాన్నే. అవి నాకప్పుడు తమాషాగా ఉండేవి. ఆ పదాలు వింటూ ఉంటే నాకూ వచ్చేసేయి.  ఒకే పదాన్ని రకరకాల రాగాలతో రెండు మూడు సార్లు పాడాలి.
           అవి ఇప్పటివరకూ మళ్ళీ ఎక్కడా వినలేదు. కూసింత ఆలకిద్దామా !
---------------------------------------------------------------------------------
          1. చిన చిన చిట్లయ్యా
               చెట్టుకింద మెట్లయ్యా
           2. ఒకర్తే కూతురాని మొగలిరేకు కొని పెడితే,
               ఒకర్తే కూతురాని మొగలిరేకు కొని పెడితే,
              మొగలిరేకు నాకొద్దు మొగుడే కావాలో
               రంచనదే వర్ధనలా
               అప్పుకొని రండో బైస్కోప్ లో తిర్సనల (తిరునాళ్ళు అన్నమాట)
               రంచనదే వర్ధనలా
           3. ఒకడే కొడుకాని బెల్లం కొనిపెడితే,
               ఒకడే కొడుకాని బెల్లం కొనిపెడితే,
               బెల్లం నాకొద్దు పెల్లామే కావాలో
               రంచనదే వర్ధనల
               అప్పుకొని రండో
               బైస్కొప్ లో తిర్సనల
               రంచనదే వర్ధనల
           4. కోరుండ పట్టుకోని కోచిబండికి నే పోతే
               కోరుండ జారిపొయి కోచిబండి పారిపోయి
               అద్దాల బండికి నేనందను గావాలె
               రంచనదే వర్ధనల
               అప్పుకొని రండో బైస్కోప్ తిర్సనల రంచనదే వర్ధనల
           5. జంతిక పట్టుకోని జత్కాబండి కి నే పోతే
               జంతిక పట్టుకోని జత్కాబండి కి నే పోతే
               జంతిక జారిపోయి జత్కాబండి పారిపోయి
               అద్దాల బండికి నేనందను గావాలె
               రంచనదే వర్ధనల
               అప్పుకొని రండో బైస్కోప్ తిర్సనల రంచనదే వర్ధనల
          6.   ఉల్లిపాయ పకోడీలు ఉడుకుచున్నవీ
                కల్లుముంత మాయమ్మ మరువజాలనే
                నిను నే మరువజాలనే    // కల్లుముంత - - -  //
         7.    వూం . . . సమర్తాడ్నెగమ్మ సాప్మీద కూకుంటే  . . . . .
                 సీ ... అపరా సిగ్గునేద సిన్న బేడెట్టి గిన్నె కొన్నాను,
                 గిన్నెలో వొన్నం యేసి నెలకి రూపాయ . . .
                 ఏటవతలున్నాయి గిలిగిచ్చకాయలో
                 జామపళ్ళమ్మరాదో నెగమ్మ జాంపళ్ళమ్మరాదో . . . . .
                 జాంపళ్ళమ్మి ఏడ్నెల్లయింది తిరుగు జాబు లేదోయ్ నెగమ్మ
                 తిరుగు జాబు లేదోయ్.
---------------------------------------------------------------------------------
       ఆ రోజుల్లో బాల్య వివాహాలుండేవి.
      " పిల్ల పెద్దదయింది ఇంకా మీకు జాబులేదు సిగ్గులేదా -
       నీకు పనికోసమని  సిన్న బేడెట్టి (అర్థణా - బేడలాగే ఉండేది) గిన్నె కొన్నాను,
       ఆ గిన్నెలో అన్నం పెట్టి నెలకి రూపాయి  జీతం మీద గిలిగిచ్చకాయ చెట్టు కింద జాంపళ్ళమ్మడానికి
        పని కుదిర్చేను ... వెళ్ళేవు ..
        కాని  నీ దగ్గరనుంచి  కబురులేదు.
        పిల్ల సమర్తాడి ఏడ్నె ల్లయింది.
        నీకు పని లేకపోతే పిల్లనెలా తెస్తావ" ని
        వచ్చిన కొడుకుని తల్లి మందలించడం.

ఈ జానపద గీతంలోని అంతరార్ధం ...

ఇక ఇందులోని కొన్ని పదాల అర్ధాలు :
రంచనదే వర్థనలా = రామచంద్రా ... నేను వర్థిల్లాలి
అప్పుకొని రండో =  కలిసి రండో
బైస్కోప్ = తిరనాళ్ళలో బై స్కోప్ అని చూపించే వారు
కోరుండ = కొబ్బరి ఉండ
అద్దాల బండి = రైలు బండి
సిగ్గునేదా = సిగ్గు లేదా
బేడ = ఆ రోజుల్లో అర్ధణా అంటే 3 పైసలు, అణా అంటే 6 పైసలు,
             బేడ అంటే 2 అణాలు లేక 12 పైసలు, పావలా అంటే 2 బేడలు లేక 24 పైసలు ...
              రౌండ్ ఫిగర్ లో 25 పైసలు ... ఇలా వుండేది లెక్క ...
చిన్న బేడ (సిన్న బేడ) =  అర్ధణా
వొన్నం = అన్నం
నెగమ్మ = లేవమ్మా

---------------------------------------------------------------------------------


మీ అభిప్రాయాలు కామెంట్ల రూపంలో తెలియజేస్తారు కదూ !?
---------------------------------------------------------------------------------
                           
                    Debbai aeLla kriMdaTa naenu vinna jaanapadaalu -1

 chinnappuDu SreekaakuLaMlOni maa 
ammammagaariMTlO maa amma oka chinna pani kurravaaDini - chinnapillalni aaDiMchaDaaniki, tippaDaaniki uyyaalalO vaesi oopaDaaniki - peTTukuMdi.  aa kurraaDu palle padaalu paaDukuMToo  saradaagaa uMDaevaaDu.karra chakka meedO, kurcheemeedO daruvaestoo paaDaevaaDu.

naenoo chinnadaannae. avi naakappuDu tamaashaagaa uMDaevi. aa padaalu viMToo uMTae naakoo vachchaesaeyi.  okae padaanni rakarakaala raagaalatO reMDu mooDu saarlu paaDaali.

           avi ippaTivarakoo maLLee ekkaDaa vinalaedu. koosiMta aalakiddaamaa !

---------------------------------------------------------------------------------
          
           1. china china chiTlayyaa

                 cheTTukiMda meTlayyaa

           2. okartae kooturaani mogaliraeku koni peDitae,

              okartae kooturaani mogaliraeku koni peDitae,

              mogaliraeku naakoddu moguDae kaavaalO

              raMchanadae vardhanalaa

               appukoni raMDO baiskOp^ lO tirsanala (tirunaaLLu 
               annamaaTa)

               raMchanadae vardhanalaa

           3. okaDae koDukaani bellaM konipeDitae,

               okaDae koDukaani bellaM konipeDitae,

               bellaM naakoddu pellaamae kaavaalO

               raMchanadae vardhanala

               appukoni raMDO

               baiskop^ lO tirsanala

               raMchanadae vardhanala

           4. kOruMDa paTTukOni kOchibaMDiki nae pOtae

               kOruMDa jaaripoyi kOchibaMDi paaripOyi

               addaala baMDiki naenaMdanu gaavaale

               raMchanadae vardhanala

               appukoni raMDO baiskOp^ tirsanala raMchanadae 
               vardhanala

           5. jaMtika paTTukOni jatkaabaMDi ki nae pOtae

               jaMtika paTTukOni jatkaabaMDi ki nae pOtae

               jaMtika jaaripOyi jatkaabaMDi paaripOyi

               addaala baMDiki naenaMdanu gaavaale

               raMchanadae vardhanala

               appukoni raMDO baiskOp^ tirsanala raMchanadae 
               vardhanala

          6.   ullipaaya pakODeelu uDukuchunnavee

                kallumuMta maayamma maruvajaalanae

                ninu nae maruvajaalanae    // kallumuMta - - -  //

         7.    vooM . . . samartaaDnegamma saapmeeda 
                kookuMTae  . . . . .

                 see ... aparaa siggunaeda sinna baeDeTTi ginne 
                 konnaanu,

                 ginnelO vonnaM yaesi nelaki roopaaya . . .

                 aeTavatalunnaayi giligichchakaayalO

                 jaamapaLLammaraadO negamma 
                 jaaMpaLLammaraadO . . . . .

                 jaaMpaLLammi aeDnellayiMdi tirugu jaabu 
                 laedOy^ negamma

                 tirugu jaabu laedOy^.

-------------------------------------------------------------------

       aa rOjullO baalya vivaahaaluMDaevi.

      "pilla peddadayiMdi iMkaa meeku jaabulaedu siggulaedaa -

       neeku panikOsamani  sinna baeDeTTi (arthaNaa - baeDalaagae uMDaedi) ginne konnaanu,

       aa ginnelO annaM peTTi nelaki roopaayi  jeetaM meeda giligichchakaaya cheTTu kiMda jaaMpaLLammaDaaniki

        pani kudirchaenu ... veLLaevu ..

        kaani  nee daggaranuMchi  kaburulaedu.

        pilla samartaaDi aeDne llayiMdi.

        neeku pani laekapOtae pillanelaa testaava" ni

        vachchina koDukuni talli maMdaliMchaDaM.



ee jaanapada geetaMlOni aMtaraardhaM ...



ika iMdulOni konni padaala ardhaalu :

raMchanadae varthanalaa = raamachaMdraa ... naenu varthillaali

appukoni raMDO = kalisi raMDO

baiskOp^ = tiranaaLLalO bai skOp^ ani choopiMchae vaaru

kOruMDa = kobbari uMDa

addaala baMDi = railu baMDi

siggunaedaa = siggu laedaa

baeDa = aa rOjullO ardhaNaa aMTae 3 paisalu, aNaa aMTae                  paisalu,

               baeDa aMTae 2 aNaalu laeka 12 paisalu, paavalaa 
              aMTae 2 baeDalu laeka 24 paisalu ...

              rauMD^ phigar^ lO 25 paisalu ... ilaa vuMDaedi lekka ...

chinna baeDa (sinna baeDa) =  ardhaNaa

vonnaM = annaM

negamma = laevammaa

-----------------------------------------------------------------------------------------------------------