ఏమిటండీ అలా చూస్తున్నారు –
నాకు మొగుడు కావాలనుకుంటున్నారా ?
కాదండోయ్ - నాకు మొగుడున్నాడు –
నే చెప్పేది ‘మొగుడు కావాలి’ చిరంజీవి సినిమా –‘మొగుడు కావాలి’ గురించి
మేము Nagpur లో నలభై అయిదు సంవత్సరాలుగా ఉన్నాము. అక్కడ తెలుగు సినిమాలు అంతగా వచ్చేవికావు. వచ్చినా ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి వేసేవారు. అలాగే
వెళ్ళివారం. తరువాత అదీ పోయి కేసెట్లు అద్దెకి వచ్చేయి. తరువాత CDలు.
పందొమ్మిదివందల తొంభైలో ఒక పెళ్ళికి నేనొక్కర్తినే
ఆంధ్రా వచ్చేను. అలా ఆంధ్రా వచ్చినపుడు ఆబగా రెండు మూడు సినిమాలు చూసేవాళ్ళం. Nagpur చేరేక స్నేహితుల మొదటి ప్రశ్న ‘తెలుగు సినిమాలు చూసేరా ? ఏం సినిమాలు చూసేరు ? ‘అని ఒకరినొకరు అడగటం పరిపాటి. అలా అడిగేక నేను చూసిన సినిమాల పేర్లు చెప్పడానికి చాలా సిగ్గేసింది.). నే చూసిన సినిమాలు ఏమిటంటే "మొగుడు కావాలి". అందులో చిరంజీవి, గాయిత్రి, రెండో సినిమా "యవ్వనం కాటేసింది". చూసినప్పుడు ఏమీ అనిపించలే. కాని ఎవరికేనా
పేరు చెప్పేటప్పుడు చచ్చేదాన్ని.
ఆ రోజుల్లో మేము సంక్రాంతి పండగకి తెలుగు స్నేహితులం కలసి - పిల్లలు, పెద్దలు కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు చేసి, చేయించి పండగ జరుపుకొనేవారము . విశాఖపట్నం లో వీధి కొళాయిల
దగ్గర నీళ్ళ బిందెలు పట్టుకుందికి ఆ వీధి వాళ్ళు వచ్చేవారు. వాళ్ళ మాట, భాష, దెబ్బలాటలు నిత్యం జరిగేవి. కొళాయి దగ్గర చూసేక .’మొగుడు కావాలి’ సినిమా చూసేక, నేను కల్పించి రాసిన ఓ స్కిట్ ని stageమీద నేను ఇంకో ఆవిడ (విజయలక్ష్మి) కలసి వేసేము.
ఈ సంక్రాంతి సంబరాలు చేయటానికి ముఖ్య కారకురాలు, నా స్నేహితురాలు, మా పిల్లలకి ఇంగ్లీషు టీచరు.
ఆవిడ school పిల్లల్ని మాయింటికి పంపిస్తే రోజూ రిహార్సులు ! ఆవిడ పేరు బాలారావు. ప్రతీ
సందడికీ మేము కలసేవారం. ప్రస్తుతం వృద్ధాప్యంతో ఏడాదిలా అన్నీ మానేసేము. అవే కాక
ముప్పై ఏళ్లుగా కిట్టీ పార్టీ 50 రూపయలతో ప్రారంభించి 2 వేలు నెలకి వేసుకొని అంతా
కలిసేవాళ్ళం. ఏడాదయి అదీ లేదు. ఆ స్కిట్ ఇదే :
- -
- - - -
అప్పలకొండ (వస్తూ) :
ఓలప్పా, అప్పా, లచ్చప్పా, ఏటి సేతున్నావ్
పనవనేదా ? పని అయిపోనాదే లచ్చప్పా
లచ్మి :
ఏటియాల ఇలా
పారొచ్చినావ్ అప్పలకొండా
అబ్బ ! అప్పలకొండా
ఏటి, పూరితి పేరుతో పిలవాల ఏటి - - - అప్పూ అని పిలు
బాగుంటది.
అప్పా సిరంజీవి
సినేమా వచ్చినాది - మేట్నీకి ఎల్దామని పదయే -
మేట్నీయా ఏటే ? పనికాకుంటే !? - నా బావకి సెప్పాలికదా . .
ఆ ఏం తెలుసుద్దిట బావకి - వెల్లిపుచ్చేస్తాము
కదప్పా -
ఏ సినీమాయే
మొగుడుకావాలి.
ఏటీ ఉన్న మొగుడుసాల్లేదేటే - మొగుడుకావాలంతున్నావ్
వల్లకోయే అప్పా
నానేతన్నాను ?
సినీమా. మొగుడు కావలి అని.
సర్నేయే పరాసికాలు.
అని తొందరపెట్టి యిద్దరూ కబుర్లు సెప్పుకుంటూ
సినీమాకెల్లేరు.
మర్నాడు ప్రొద్దున్నే కొళాయి దగ్గర చాలా బిందెలు – ‘ముందు నానంటే నాను’ అని తోపులాట.
యింతలో అప్పలకొండ అనే అప్పూ మొకం వాచి, జుత్తు రేగి ఉన్న ముఖంతో ‘నాను ముందట్టుకోవాల నీళ్ళు ‘ అని బిందె తీసి కొళాయి కింద
పెట్టింది. దాంతో అందరూ ‘ఏటే ముందు నువ్వట్టుకోవాలే నీళ్ళు – యెనక్కెల్లు’ అని ఒక్క తోపు తోసేరెవరో !
‘ఓలమ్మో సచ్చిపోనాన్రోయ్ - నీ జిమ్మడ –‘ ఈ లోగా నిన్నటి లచ్మి
వచ్చింది.
‘ఏదీ నా బిందె ఈడ లయినులో పెట్టి ఎల్లినాను - ఏదీ ?
’ అంటూ.
‘ఏటే లయాన్ అంటనావు. నాకసలే సిరాగ్గుంది, జొరం వచ్చింది నన్నట్టుకోనీయే నీళ్ళు ముందు’
‘అదేం కుదరదు ‘
‘ ఏటే పేల్తున్నావ్ ఈ కొలాయి నీ బాబు కట్టించాడేటి? ‘
‘అవునే నా బాబే కట్టించాడు – ఏటంటావ్’
‘అవున్లేయే ఊరంతా నీ బాబులే ! వొల్లకోయే’
‘ఏటి కూసేవ్? ’
యిద్దరూ మీదమీదకు వచ్చి జుట్టు జుట్టు పట్టుకొని
(శిఖపట్ల కాండ)
‘నీ వంసం నా కెరికె -
ఏటనుకున్నావ్ . . . .’ అంటూ పోట్లాట – (ముందు రోజు కలిసి సినిమాకెళ్ళీన స్నేహం అంతా హుష్ కాకి అయిపోయింది.)
అందరూ ఇద్దర్నీ విడిపిస్తారు - ఈలోగా నీళ్ళు బందు -
మిగతా వాళ్ళ బిందెలు నిండు !
ఆ రోజు సాయంత్రం.
అప్పూ వాచిన ముఖం చూసిన లచ్చి ‘ఏటయినాది అప్పూ –?’ అడిగింది...
(మళ్ళీ స్నేహాలు మొదలు)
‘ఏం లేదప్పానిన్న మనం సినీమాకెల్లాక నా మామ బస్సందక తిరిగొచ్చినాదంట. యిల్లు
తాలం సూసి సివాలెత్తిపోయి సెట్టుకింద కూకున్నాడు. నేనొచ్చి తాలం తీసి గుడిసెనోకి
ఎల్లడమేటి - మామ నా జుట్టుట్టకొని ఎటెల్లినయే . . పెత్తనాలకి, అని వొల్లు కుల్లబొడిసేడు దొంగసచ్చినోడు. ఏటి సేత్తునప్పా!’ అని యిద్దరూ కావటేసుకొని
ఏడుపు. ‘వల్లకోయే అప్పలకొండా ఏటి సేత్తాం ! మనబతుకులింతే. ‘
(విశాఖలో కొళాయి దగ్గర నిత్యం రకరకాల తిట్లు, శిఖపట్లు, బిందెలు విసురుకోటం ఆ రోజుల్లో జరిగేవి.)
(అటుపక్క కొంతమంది మొగుడ్ని బావ అని, మామ అని, అక్కకి అప్ప అని అంటారు -)
moguDu kaavaali
aemiTaMDee alaa choostunnaaru –
naaku moguDu kaavaalanukuMTunnaaraa ?
kaadaMDOy^ - naaku moguDunnaaDu –
nae cheppaedi ‘moguDu kaavaali’ chiraMjeevi sinimaa –‘moguDu kaavaali’ guriMchi
maemu Nagpur lO nalabhai ayidu saMvatsaraalugaa unnaamu. akkaDa telugu sinimaalu aMtagaa vachchaevikaavu. vachchinaa aadivaaraM udayaM tommidi gaMTalaki vaesaevaaru. alaagae veLLivaaraM. taruvaata adee pOyi kaeseTlu addeki vachchaeyi. taruvaata CDlu.
paMdommidivaMdala toMbhailO oka peLLiki naenokkartinae aaMdhraa vachchaenu. alaa aaMdhraa vachchinapuDu aabagaa reMDu mooDu sinimaalu choosaevaaLLaM. Nagpur chaeraeka snaehitula modaTi praSna ‘telugu sinimaalu choosaeraa ? aeM sinimaalu choosaeru ? ‘ani okarinokaru aDagaTaM paripaaTi. alaa aDigaeka naenu choosina sinimaala paerlu cheppaDaaniki chaalaa siggaesiMdi.). nae choosina sinimaalu aemiTaMTae "moguDu kaavaali". aMdulO chiraMjeevi, gaayitri, reMDO sinimaa "yavvanaM kaaTaesiMdi". choosinappuDu aemee anipiMchalae. kaani evarikaenaa paeru cheppaeTappuDu chachchaedaanni.
aa rOjullO maemu saMkraaMti paMDagaki telugu snaehitulaM kalasi - pillalu, peddalu kalisi saaMskRtika kaaryakramaalu chaesi, chaeyiMchi paMDaga jarupukonaevaaramu . viSaakhapaTnaM lO veedhi koLaayila daggara neeLLa biMdelu paTTukuMdiki aa veedhi vaaLLu vachchaevaaru. vaaLLa maaTa, bhaasha, debbalaaTalu nityaM jarigaevi. koLaayi daggara choosaeka .’moguDu kaavaali’ sinimaa choosaeka, naenu kalpiMchi raasina O skiT^ ni stagemeeda naenu iMkO aaviDa (vijayalakshmi) kalasi vaesaemu.
ee saMkraaMti saMbaraalu chaeyaTaaniki mukhya kaarakuraalu, naa snaehituraalu, maa pillalaki iMgleeshu Teecharu. aaviDa school pillalni maayiMTiki paMpistae rOjoo rihaarsulu ! aaviDa paeru baalaaraavu. pratee saMdaDikee maemu kalasaevaaraM. prastutaM vRddhaapyaMtO aeDaadilaa annee maanaesaemu. avae kaaka muppai aeLlugaa kiTTee paarTee 50 roopayalatO praaraMbhiMchi 2 vaelu nelaki vaesukoni aMtaa kalisaevaaLLaM. aeDaadayi adee laedu. aa skiT^ idae :
- - - - - -
appalakoMDa (vastoo) :
Olappaa, appaa, lachchappaa, aeTi saetunnaav^ panavanaedaa ? pani ayipOnaadae lachchappaa
lachmi :
aeTiyaala ilaa paarochchinaav^ appalakoMDaa
abba ! appalakoMDaa aeTi, pooriti paerutO pilavaala aeTi - - - appoo ani pilu baaguMTadi.
appaa siraMjeevi sinaemaa vachchinaadi - maeTneeki eldaamani padayae -
maeTneeyaa aeTae ? panikaakuMTae !? - naa baavaki seppaalikadaa . .
aa aeM telusuddiTa baavaki - vellipuchchaestaamu kadappaa -
ae sineemaayae
moguDukaavaali.
aeTee unna moguDusaallaedaeTae - moguDukaavaalaMtunnaav^
vallakOyae appaa naanaetannaanu ?
sineemaa. moguDu kaavali ani.
sarnaeyae paraasikaalu.
ani toMdarapeTTi yiddaroo kaburlu seppukuMToo sineemaakellaeru.
marnaaDu proddunnae koLaayi daggara chaalaa biMdelu – ‘muMdu naanaMTae naanu’ ani tOpulaaTa.
yiMtalO appalakoMDa anae appoo mokaM vaachi, juttu raegi unna mukhaMtO ‘naanu muMdaTTukOvaala neeLLu ‘ ani biMde teesi koLaayi kiMda peTTiMdi. daaMtO aMdaroo ‘aeTae muMdu nuvvaTTukOvaalae neeLLu – yenakkellu’ ani okka tOpu tOsaerevarO !
‘OlammO sachchipOnaanrOy^ - nee jimmaDa –‘ ee lOgaa ninnaTi lachmi vachchiMdi.
‘aedee naa biMde eeDa layinulO peTTi ellinaanu - aedee ? ’ aMToo.
‘aeTae layaan^ aMTanaavu. naakasalae siraagguMdi, joraM vachchiMdi nannaTTukOneeyae neeLLu muMdu’
‘adaeM kudaradu ‘
‘ aeTae paeltunnaav^ ee kolaayi nee baabu kaTTiMchaaDaeTi? ‘
‘avunae naa baabae kaTTiMchaaDu – aeTaMTaav^’
‘avunlaeyae ooraMtaa nee baabulae ! vollakOyae’
‘aeTi koosaev^? ’
yiddaroo meedameedaku vachchi juTTu juTTu paTTukoni (SikhapaTla kaaMDa)
‘nee vaMsaM naa kerike - aeTanukunnaav^ . . . .’ aMToo pOTlaaTa – (muMdu rOju kalisi sinimaakeLLeena snaehaM aMtaa hush^ kaaki ayipOyiMdi.)
aMdaroo iddarnee viDipistaaru - eelOgaa neeLLu baMdu - migataa vaaLLa biMdelu niMDu !
aa rOju saayaMtraM.
appoo vaachina mukhaM choosina lachchi ‘aeTayinaadi appoo –?’ aDigiMdi...
(maLLee snaehaalu modalu)
‘aeM laedappaaninna manaM sineemaakellaaka naa maama bassaMdaka tirigochchinaadaMTa. yillu taalaM soosi sivaalettipOyi seTTukiMda kookunnaaDu. naenochchi taalaM teesi guDisenOki ellaDamaeTi - maama naa juTTuTTakoni eTellinayae . . pettanaalaki, ani vollu kullaboDisaeDu doMgasachchinODu. aeTi saettunappaa!’ ani yiddaroo kaavaTaesukoni aeDupu. ‘vallakOyae appalakoMDaa aeTi saettaaM ! manabatukuliMtae. ‘
(viSaakhalO koLaayi daggara nityaM rakarakaala tiTlu, SikhapaTlu, biMdelu visurukOTaM aa rOjullO jarigaevi.)
(aTupakka koMtamaMdi moguDni baava ani, maama ani, akkaki appa ani aMTaaru -