మనకి చాలమంది దేవుళ్ళు, దేవతలు. వారితో పాటు పూజలు, వ్రతాలు, నోములు, రకరకాల వేడుకలు, సరదాలు . వాటిలో కొన్ని అందరికీ తెలీదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా దేముళ్ళు, దేవతలకీ వాహనాల గురించి. అలా జంతువులు, పక్షులుకీ కూడ పూజలు చేస్తుంటాము. ఉదాహరణకి వినాయకుని ముఖం గజముఖం - వాహనం ఎలుక. సుబ్రహ్మణ్యస్వామికి నెమలి వాహనం. నాగుల చవితికి పుట్టలో పాలు, పాముకి పూజ, శనీశ్వరునికి కాకి వాహనం. మనకి కాకి కూడ ముఖ్యమే. అన్నిటికీ గోలగా ఉంటే కాకి గోల అంటాం. కానీ పిండప్రధానానికి ముఖ్యం కాకి! కలిసి వుండడానికి కాకులనే చెప్పుకుంటారు. ఇక హంస సరస్వతికి వాహనం, సింహం దుర్గకి, పులి జై మాతా కి ఇలా చాలా. మరి గోమాత కి మన హిందూ సంప్రదాయంలో ఎంతటి విశిష్ట స్థానం వుందో చెప్పనక్కర్లేదు. కుక్కకి నాగపూర్ గుడిలో కాలభైరవుడి గా ఓ విగ్రహం ఉంది. యమధర్మరాజు కుక్క రూపంలో ధర్మరాజుని తన వెంట పైలోకాలకి వెళతాడు.
ఇవి చాలా ఉండగా, నేను చెప్పబోయే పూజ - విశాఖ జిల్లాలో అనుకుంటాను - మా యిళ్లల్లో యిప్పటికీ చేస్తుంటారు. అదేమిటంటే - ఎవరికైనా పిల్ల పుడితే - యిరవై ఒకటో రోజున ఆ పిల్ల లేక పిల్లాడిని ఉయ్యాలలో వేసి - పూజ చేస్తారు. దాన్ని కప్పకి మొక్కడం అంటారు. కప్పని మొక్కటం ఏమిటి ? కప్పని ఎక్కడనుంచి తెస్తామని అడిగినవారుకూడా వున్నారు. నాకు తెలిసి చాలామంది కప్పని మొక్కే తతంగం చేసేవారు అంటే - యిప్పటి పిల్లలు ఒకటే నవ్వులు. "ఆంటీ మీరొచ్చి చేయించండి, ఆ కథ చెప్పండి " అని చాల సరదాగా అడుగుతారు. చాలమంది పెద్దవాళ్ళకి కూడా ఆ తతంగం చెప్తే "మాకు తెలీదండీ ఏదో మా అమ్మ మాకు చేయించింది - మేమూ చేయిస్తున్నాము" అని చెప్పేవారు. కొన్ని ప్రాంతాల్లో ఈ తతంగాన్ని 'నూతిలో చేద ' అని కూడ అంటారు.
ప్రసవం తరువాత ఇరవై ఒకటో రోజు నామకరణం, సాయంత్రం ఉయ్యాల్లో పిల్లల్ని వేయటం, తరువాత నూతి (బావి) దగ్గరకి తీసుకెళ్ళి చెరువైపులా తల్లి, బాలింత యిద్దరూ నూతిలో నీళ్ళు మూడుసార్లు తోడి పాపాయి గుడ్డలు తడిపేవారు. అదికాక, బాలింత చేత నూతి గట్టు కడిగించి, ముగ్గు పెట్టించి, కొంచెం మన్ను నీళ్ళతో తడిపి మూడుముద్దలుగా , గొబ్బెమ్మల్లా పెట్టించి దానికి పసుపు, కుంకుం, పూలు పెట్టి, పూజ చేసి, నైవేద్యం (ఆరోజుల్లో బాలింతకి 'కాయం'అని తినిపించేవారు), తాంబూలంలో కాయం, వెల్లుల్లిపాయ పెట్టి ముగ్గురికి బొట్టు పెట్టి యిప్పించేవారు. ముఖ్యంగా పిల్లల్లేనివాళ్ళు, కొత్తగా పెళ్ళైనవాళ్ళకీ యిస్తే వాళ్లకి పిల్లలు పుడతారని నమ్మకం. ఇంక ఆ మట్టి గొబ్బెమ్మల సంగతి చూద్దామా ! అవే - మూడు కప్పలు! మొదటి కప్పకి పూజ తరువాత తీసి 'కప్పలా సాగాలి ' అని నూతిలో మట్టి కప్పను వేయాలి. రెండో మట్టి కప్పను తీసి నూతిలోవేస్తూ ' కప్పలా దూకాలి' అనాలి. మూడో కప్పను వేస్తూ 'కప్పలా బతకాలి ' అని దండం పెట్టుకోవాలి.
ఇందులో ఎంతర్థం వుందో చూసేరా ? తన పిల్ల - కప్పలా సాగాలి - అంటే బాగా పొడుగుగా ఎదగాలి, రెండో కప్పలా తుళ్ళుతూ, గెంతుతూ దూకాలి! ఇంక మూడో కప్ప ! కప్ప నీళ్ళల్లోను, బ్రతుకుతుంది, పెద్దరాయి క్రిందకూడా చాలా రోజులు బ్రతుకుతుంది. మా పిల్లలు కూడా యిలా చురుకుగా బ్రతకాలని కప్పని మొక్కటం అంటారు.
మా చెల్లెళ్ళు ఢిల్లీలో పెరగటం వలన మన సంప్రదాయాలు తెలియవు. పిల్లలకి పెళ్ళి, పెళ్ళయ్యాక ప్రతీ వేడుకా చేద్దామని ఎలా చేస్తారక్కా అని అడిగి చేస్తుంటారు . ఈ కప్పని మొక్కటం చెప్పగానే - అమ్మో మూడు కప్పలు ఎక్కడనుంచి తెస్తాం ! అవి తిన్నగా ఉంటాయా అని - అంతా నవ్వుకుంటూ -మనపూజలో పసుపు గణపతిని చేసినట్లు మట్టితో కప్పచెయ్యాలి! మనసు ప్రథానం - అనుకుంటూ నాటి ఆచారాలు మేమింకా ఎక్కడున్నా సాగిస్తున్నాం!.
bAliMtalu kappani mokkE saMpradAyaM
manaki cAlamaMdi dEvuLLu, dEvatalu. vAritO pATu pUjalu, vratAlu, nOmulu, rakarakAla vEDukalu, saradAlu . vATilO konni aMdarikI telIdEmO anipistuMdi. muKyaMgA dEmuLLu, dEvatalakI vAhanAla guriMci. alA jaMtuvulu, pakShulukI kUDa pUjalu cEstuMTAmu. udAharaNaki vinAyakuni muKaM
gajamuKaM - vAhanaM eluka. subrahmaNyasvAmiki nemali vAhanaM. nAgula cavitiki puTTalO pAlu, pAmuki pUja, SanISvaruniki kAki vAhanaM. manaki kAki kUDa muKyamE. anniTikI gOlagA uMTE kAki gOla aMTAM. kAnI piMDapradhAnAniki muKyaM kAki! kalisi vuMDaDAniki kAkulanE ceppukuMTAru. ika haMsa sarasvatiki vAhanaM, siMhaM durgaki, puli jai mAtA ki ilA cAlA. mari gOmAta ki mana hiMdU saMpradAyaMlO eMtaTi viSiShTa sthAnaM vuMdO ceppanakkarlEdu. kukkaki nAgapUr guDilO kAlaBairavuDi gA O vigrahaM uMdi. yamadharmarAju kukka
rUpaMlO dharmarAjuni tana veMTa pailOkAlaki veLatADu.
ivi cAlA uMDagA, nEnu ceppabOyE pUja - viSAKa jillAlO anukuMTAnu - mA yiLlallO yippaTikI cEstuMTAru. adEmiTaMTE - evarikainA pilla puDitE - yiravai okaTO rOjuna A pilla lEka pillADini uyyAlalO vEsi - pUja cEstAru. dAnni kappaki mokkaDaM aMTAru. kappani mokkaTaM EmiTi ? kappani ekkaDanuMci testAmani aDiginavArukUDA vunnAru. nAku telisi cAlAmaMdi kappani mokkE tataMgaM cEsEvAru aMTE - yippaTi pillalu okaTE navvulu. "AMTI mIrocci cEyiMcaMDi, A katha ceppaMDi " ani cAla saradAgA aDugutAru. cAlamaMdi peddavALLaki kUDA A tataMgaM ceptE "mAku telIdaMDI EdO mA amma mAku cEyiMciMdi - mEmU cEyistunnAmu" ani ceppEvAru. konni prAMtAllO I tataMgAnni 'nUtilO cEda ' ani kUDa aMTAru.
prasavaM taruvAta iravai okaTO rOju nAmakaraNaM, sAyaMtraM uyyAllO pillalni vEyaTaM, taruvAta nUti (bAvi) daggaraki tIsukeLLi ceruvaipulA talli, bAliMta yiddarU nUtilO nILLu mUDusArlu tODi pApAyi guDDalu taDipEvAru. adikAka, bAliMta cEta nUti gaTTu kaDigiMci, muggu peTTiMci, koMceM mannu nILLatO taDipi mUDumuddalugA , gobbemmallA peTTiMci dAniki pasupu, kuMkuM, pUlu peTTi, pUja cEsi, naivEdyaM (ArOjullO bAliMtaki 'kAyaM'ani tinipiMcEvAru), tAMbUlaMlO kAyaM, vellullipAya peTTi mugguriki boTTu peTTi yippiMcEvAru. muKyaMgA pillallEnivALLu, kottagA peLLainavALLakI yistE vALlaki pillalu puDatArani nammakaM. iMka A maTTi gobbemmala saMgati cUddAmA ! avE - mUDu kappalu! modaTi kappaki pUja taruvAta tIsi 'kappalA sAgAli ' ani nUtilO maTTi kappanu vEyAli. reMDO maTTi kappanu tIsi nUtilOvEstU ' kappalA dUkAli' anAli. mUDO kappanu vEstU 'kappalA batakAli ' ani daMDaM peTTukOvAli.
iMdulO eMtarthaM vuMdO cUsErA ? tana pilla - kappalA sAgAli - aMTE bAgA poDugugA edagAli, reMDO kappalA tuLLutU, geMtutU dUkAli! iMka mUDO kappa ! kappa nILLallOnu, bratukutuMdi, peddarAyi kriMdakUDA cAlA rOjulu bratukutuMdi. mA pillalu kUDA yilA curukugA bratakAlani kappani mokkaTaM aMTAru.
mA celleLLu DhillIlO peragaTaM valana mana saMpradAyAlu teliyavu. pillalaki peLLi, peLLayyAka pratI vEDukA cEddAmani elA cEstArakkA ani aDigi cEstuMTAru . I kappani mokkaTaM ceppagAnE - ammO mUDu kappalu ekkaDanuMci testAM ! avi tinnagA uMTAyA ani - aMtA navvukuMTU -manapUjalO pasupu gaNapatini cEsinaTlu maTTitO kappaceyyAli! manasu prathAnaM - anukuMTU nATi AcArAlu mEmiMkA ekkaDunnA sAgistunnAM!.
సుగుణక్కా !
ReplyDeleteచదివే వాళ్ళకి ఇంట్రస్టింగ్ గా, ముందు తరాల వారికి ఉపయోగ పడే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నీ ద్వారా బైటికొస్తోంది. చాలా సంతోషంగా వుంది. బండి పట్టాలెక్కేసింది. ఇంక ఆపకు. ఆగకు. మూడు రోజులకొకటైనా రాయాలన్న నియమం పెట్టుకో. కనీసం వారానికొకటైనా వస్తుంది - రాజా
sugunakka...
ReplyDeleteVery nice article. I never heard about this pooja, but it is fun to read and you have written in very simple telugu. Keep it up! We look forward to such stories and experiences!
vijaya
Chaala interesting gaa vundi! mana chinnappudu skl intilo nuuti daggara choose vaadini.Adi ippudu jnaapakam vastunnadi.Kottukaaram madilo merustunnadi.nice! Inka rastu vundu!
ReplyDeletePrembabu
Good memory. This practice is still continued in Godavari districts. pl remove word verification
ReplyDeleteపిన్ని గారు, చాలా మంచి విషయాలు చెప్తున్నారండీ. మా తరం వారికి తెలియని లేదా మర్చిపోయిన ఎన్నో మంచి విసయాలు మీలాంటి పెద్దవారు మాతో పంచుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళా కనీసం జీవం పోసుకునే అవకాశం ఉంటుందండీ
ReplyDeleteపొడి కాయం, ఉడుకు కాయం చేసేవారు కదా!కాయం చేసే విధానం చెప్పండి.
ReplyDeleteThank you for your info .. Google lo me info tappa inkemi dorakaledu Andi. Meku tekisthe ganaka Pooja vidhanam kuda post chesthe chala mandiki helpfull ga vuntundi.
ReplyDelete