ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ గారు స్వర్గస్తులైనారని తెలిసిన రోజు నాకు. చాలా విచారకరమైన రోజు ! మాలతి గారితో నా పరిచయము 1952, ఆగస్టు 15 ప్రభలో ప్రమదావనం శీర్షికలో "అందాలు - అలంకారాలు" తో మొదలై, అలా నేను కూడ ప్రశ్నలు, వంటలు, వ్యాసాలు రాస్తూ 1958, అక్టోబరు 2 న మద్రాసు కచ్చేరి రోడ్డులో వున్న వారింట్లో కలిసి రోజంతా కబుర్లు !
చందూర్ గారు, శారదగారు అందరితో పరిచయం, స్నేహం, విత్తు, మొలక, చెట్టు, పువ్వులు, కాయలు కాసింది.
ఆ సమయంలో మేము ఢిల్లీ, తరవాత హిస్సారు - (అప్పటి పంజాబ్, ఇప్పుడు హరియానా) లో వుండేవారం. నా పేరుకి ’హిస్సారు సుగుణ’ అని చేర్చింది కూడా మాలతిగారే !
ఆంధ్రపత్రిక, ఆంధ్ర ప్రభలో ముప్పై సంవత్సరాలు చిన్న, చితక వ్యాసాలు, చిన్న కథలు , వంటలు వగైరా రాసే దాన్ని !
ఒకసారి చందూర్ దంపతులు మరాఠీ రచయిత్రులను కలియటానికి నాగపూర్ వచ్చేరు. నేను వెళ్ళి కలిస్తే పాతికేళ్ళ తరువాత నన్ను చూసి ’సుగుణా’ అని పిలిస్తే ఆశ్చర్యపోయేను. అంత జ్ఞాపకం ఆవిడకి.
పాతికేళ్ళలో నా రూపు మారిపోయినా మాలతి చందూర్ మట్టుకు సన్నగా మాలతీ లతలాగే వున్నారు. వాళ్ళతో ఒకటిన్నర రోజు నాగపూర్ లో రచయిత్రులం సర్దాగా కాలక్షేపం చేసేము.
ఆ తర్వాత మాలతి గారు, నేను తరచూ ఫోన్లు చేసుకొనేవాళ్ళం, స్వాతిలో "నన్ను అడగండి" లో పాఠకులకు జబాబిస్తూ - తను డిగ్రీ చేయలేదని, ఆవిడ పుట్టింటివారు కౌండిన్యస గోత్రం - అని రాసేరు. దాంతో నేను ఫోన్లో,
"నేనూ అంతే, మా పుట్టింటి వారూ కౌండిన్యసే" అన్నాను. ఆవిడ జవాబేమిటో తెలుసా ? "అందుకే మనిద్దరికీ కలిసింది. క్రిందటి జన్మలో అక్క చెళ్ళెల్లం అయుంటాము."
స్వాతిలో "పాత కెరటాలు" , ఆంధ్ర ప్రభలో ప్రమదావనం, కథలు, నవలలు ఎన్ని రాసేరో కోకొల్లలు. అన్నీ చదివేను. ఇంక ఆవిడ భర్త చందూర్ గారు కూడా ఎన్ని రాసేరో !? ఆయనవి హాస్యంతో నిజ జీవితం గుఱించి రాసే కథల్లో - "మనకీ ఒక కారు" ఒకటి.. ఆ రోజుల్లో కారు ఒక స్టేటస్ సింబల్! ఈ కథ నాకు బాగా నచ్చిన కథ.
ఎప్పుడైనా ఫోన్ చేస్తే -చందూర్ గారు ఫోన్ తీస్తే - "సుగుణా, మీరేనా, ఆ ఎడ్రెసేనా" అని అడిగితే "అవునండీ" అన్న వారంకల్లా ఆయన నడిపిన 'జగతి' పత్రికని పంపించేవారు. జగతిలో రెండు సంచికలలో నా కథ కూడా వేసి ’బాగా రాసేర” అని మెచ్చుకున్నారు. ఇవీ మాలతీ చందూర్ తో నా అనుభవాలు, మధుర స్మృతులు
.
మాలతిగారు విజ్ఞానఖని! ఆవిడ భౌతికంగా లేరు. కాని ఆవిడ రచనలు,
రాసే ప్రతి అక్షరం మన కళ్ళముందుంటాయి. చందూర్ గారు మాలతి గారికి మామయ్య. మాలతి గారు అన్నిటికీ మామయ్య, అనే వారు
’మామయ్య వల్లనే నేనింతటి దాన్నయ్యేన” అంటూ ఆ మామయ్యను
చేరుకుంది మాలతి.
mAlatiki manasAMjali
pramuKa racayitri mAlatI caMdUr gAru svargastulainArani telisina rOju nAku. cAlA vicArakaramaina rOju ! mAlati gAritO nA paricayamu 1952, AgasTu 15 praBalO pramadAvanaM SIrShikalO "aMdAlu - alaMkArAlu" tO modalai, alA nEnu kUDa praSnalu, vaMTalu, vyAsAlu rAstU 1958, akTObaru 2 na madrAsu kaccEri rODDulO vunna vAriMTlO kalisi rOjaMtA kaburlu !
caMdUr gAru, SAradagAru aMdaritO paricayaM, snEhaM, vittu, molaka, ceTTu, puvvulu, kAyalu kAsiMdi.
A samayaMlO mEmu DhillI, taravAta hissAru - (appaTi paMjAb, ippuDu hariyAnA) lO vuMDEvAraM. nA pEruki 'hissAru suguNa' ani cErciMdi kUDA mAlatigArE !
AMdhrapatrika, AMdhra praBalO muppai saMvatsarAlu cinna, citaka vyAsAlu, cinna kathalu , vaMTalu vagairA rAsE dAnni !
okasAri caMdUr daMpatulu marAThI racayitrulanu kaliyaTAniki nAgapUr vaccEru. nEnu veLLi kalistE pAtikELLa taruvAta nannu cUsi 'suguNA' ani pilistE AScaryapOyEnu. aMta j~jApakaM AviDaki.
pAtikELLalO nA rUpu mAripOyinA mAlati caMdUr maTTuku sannagA mAlatI latalAgE vunnAru. vALLatO okaTinnara rOju nAgapUr lO racayitrulaM sardAgA kAlakShEpaM cEsEmu.
A tarvAta mAlati gAru, nEnu taracU POnlu cEsukonEvALLaM, svAtilO "nannu aDagaMDi" lO pAThakulaku jabAbistU - tanu DigrI cEyalEdani, AviDa puTTiMTivAru kauMDinyasa gOtraM - ani rAsEru. dAMtO nEnu POnlO,
"nEnU aMtE, mA puTTiMTi vArU kauMDinyasE" annAnu. AviDa javAbEmiTO telusA ? "aMdukE maniddarikI kalisiMdi. kriMdaTi janmalO akka ceLLellaM ayuMTAmu."
svAtilO "pAta keraTAlu" , AMdhra praBalO pramadAvanaM, kathalu, navalalu enni rAsErO kOkollalu. annI cadivEnu. iMka AviDa Barta caMdUr gAru kUDA enni rAsErO !? Ayanavi hAsyaMtO nija jIvitaM gurxiMci rAsE kathallO - "manakI oka kAru" okaTi.. A rOjullO kAru oka sTETas siMbal! I katha nAku bAgA naccina katha.
eppuDainA POn cEstE -caMdUr gAru POn tIstE - "suguNA, mIrEnA, A eDresEnA" ani aDigitE "avunaMDI" anna vAraMkallA Ayana naDipina 'jagati' patrikani paMpiMcEvAru. jagatilO reMDu saMcikalalO nA katha kUDA vEsi 'bAgA rAsEra'' ani meccukunnAru. ivI mAlatI caMdUr tO nA anuBavAlu, madhura smRutulu
.
mAlatigAru vij~jAnaKani! AviDa BautikaMgA lEru. kAni AviDa racanalu,
rAsE prati akSharaM mana kaLLamuMduMTAyi. caMdUr gAru mAlati gAriki mAmayya. mAlati gAru anniTikI mAmayya, anE vAru
'mAmayya vallanE nEniMtaTi dAnnayyEna'' aMTU A mAmayyanu
cErukuMdi mAlati.

మాలతి గారి గురించి ఎంత బాగా రాసేరు సుగుణక్కా...ఆమె నాకు కూడా అభిమాన రచయిత్రి...తనవి అన్ని నవలలూ చదివాను. 'మనకీ ఒక కారు' అనే కథ మీకు గుర్తుంటే చెప్పరూ, చక్కగా రాసారు మాలతి గారి, చందూర్ గారి స్నేహం, అభిమానాల గురించి....మీరిలా ఎన్నో ఎన్నెన్నో మంచి రచనలు ఇంకా ఇంకా మా కోసం అందించాలి అని నా మనవి.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteSugunakka Malatigari gurinchi nee anubhavaalu chaala baagunnayi.Andhra prabhalo nee prasnalaki javaabulistu nuvvu avidaki Hissar Sugunavainaavu. Avidato neeku anno anubhavaalu inka vunnayi.Andhra patrikalo nee modati vyaasam"Delhilo madhyannam padakondu gantalavela" to modalayindi.Naaku ippatiki jnapakam.Inka manchi vyasalu raayi.
ReplyDeleteAll the best ....Prembabu
Malathi Chandur gari Katha Bonsai kathanu yevaraina visleshana hara?
ReplyDelete