Saturday, March 8, 2014

                                      నాన్న (గోవిందరావు) తో చిన్ననాటి జ్ఞాపకాలు 

 గాదె గోవింద రావు  మా చిన్నక్కమ్మ కొడుకు. మా ఇంట్లో మేనత్తలని, పెద్ద ఆడ పడుచులలో కొందరిని ’అక్కమ్మ’ అని పిలిచే సంప్రదాయం వుంది. ఆల్రెడీ అప్పటికే ఒక అక్కమ్మ వుండడంతో మా అమ్మ అక్కని ’చిన్నక్కమ్మ’ అని పిలిచే వాళ్ళం. అలా తను మా పెద్దమ్మ గారి కొడుకు. నాకు పెద్ద తమ్ముడు. అందరం నాన్న అని పిలుస్తాం.
శ్రీకాకుళంలోని మా అమ్మమ్మ గారింట్లో మేం కలిసి పెరిగిన నాటి  రోజులు - నిజంగా గోల్డెన్ డేస్.
మా అమ్మమ్మ గారిల్లు అప్పటి సినిమాల్లో చూపించే పల్లెటూరు ఇల్లు. అదే ఇప్పుడు రంగుల్లో చూపిస్తే 'ఆహా ఓహో' అంటాము.
            ఈనాడు ఎన్ని చూసినా - అన్నీ చూసేసినా - దిబ్బరొట్టి నుంచి పిజ్జా వరకు, చెప్పులులేని కాళ్ళతో మట్టిలో పరుగులునుంచి ఏసి కార్లు, ప్లేన్లు వరకు ఏది అనుభవించినా ఆనాటి మా జ్ఞాపకాలకు సాటి రావు. 
కానీ అనాడు ... !?
        రోజూ యింట్లో సరుకులు, కూరలు తేవటం, నీళ్ళు నూతిలోంచి తోడుకొని స్నానం చేయటం, జాంచెట్టు ఎక్కి కాయలు కోసుకొని చెట్టుమీద కూర్చొని తినటం . గడ్డికుప్ప ఎక్కి జారటం, ఉసిరికాయల్ని ఉప్పు అద్దుకొని తినటం ...
     స్కూలునుంచి రాగానే అమ్మమ్మ పిల్లలందకీ తలా కాణీ ఇచ్చేది. ఏదన్నా కొనుక్కొని తినటం, కాణీకి చెరుకుముక్క, పెద్దరస్కు, కొబ్బరుండ, చిన్న జంతిక ఇలా వచ్చేవి.
    ఇవికాక యింట్లో కధ, కార్యం వచ్చినపుడు - భోజనాలు లేటయ్యేవి. అందుకని పిల్లలకి చిన్నవంట, ఇంగువచారు, పెసరపప్పుఅన్నం . అదీ కుదరకపోతే తరవాణీ అన్నం, వాము, ఆవకాయ, వెంకటాపురం మిరపపళ్ళు ఆరెంజిరంగులో ఉండేవి, చిదుపుకొని నూనె వేసుకొని అన్నం కలిపి తింటే ఆ పులుపు, కారం అబ్బ ... ఇప్పుడు నోటిలో నీళ్ళూరుతున్నాయి ! మాకు ఇవి పెట్టి మాచేత పెద్దవాళ్ళు హొటల్ నుండి ఇడ్లీలు, దోసెలు తెప్పించుకొని తినేవారు. మాకూ తినాలనుండేది. అడుగుతే చిన్నపిల్లలు ఇవి తింటే జబ్బు చేస్తుంది అనేవాళ్ళు. అంతే గుప్ చప్ !
      ఇవికాక, ఎరకయ్య కొట్లో ఎండాకాలం పల్చని మజ్జిగతేటలో ఉప్పు, దబ్బాకు, నిమ్మరసం, చిన్న మిరపకాయ వేసి అణాకు అమ్మేవాడు, అది కొనుక్కొని చెరిసగం సిల్వర్ (వెండికాదు) గ్లాసులో  తాగేవాళ్ళం. పకోడీల పొట్లం అర్థణా. అందరికీ తెచ్చేవాళ్ళం. అందరి పిల్లల్లాగే కొన్ని మస్తీ (చిలిపి) పన్లు చేసేవాళ్ళం. బరాటం వీధిలో సత్యం కొట్టు. ఎదురు వీధిలో (సానివీధి అనే వాళ్ళు) నారాయణస్వామి కోమటి కొట్టుండేది. నారాయణస్వామి మహా పీనాసి ..  ముసలివాడు .. వొంగిపోయి చిన్న పంచె కట్టుకొని ఉండేవాడు. ఏమేనా కొంటే ఆ రోజుల్లో సోల, తవ్వ, అడ్ద, కుంచం. అందులో లెక్కపెట్టేటప్పుడు ఒకటి అనేవాడుకాదు. లాభం, రెడ్డు (రెండు పలికేదికాదు) మూడు అనేవాడు. ఓసారి ఏవో కొని మాకు వాపసు ఇవ్వవలసిన డబ్బు కన్న ఒకరూపాయ ఎక్కువ ఇచ్చేడు. ఇంక మాకు పెద్ద పెన్నిధి , గాబరా, పదిసార్లు లెక్కపెట్టి రూపాయి కంపస్ బాక్సులో దాచుకొని మిగతాది అమ్మమ్మకిచ్చిమర్నాడు స్కూలు అయ్యేక ప్రొద్దున్న 11 గం. కి ఆ డబ్బులోంచి మూడు పావలాలు పెట్టి మిక్స్చరు, కలర్ సోడా ఏదో కొనుక్కొని తినేసేం . ఇంటికొచ్చి స్నానం చేసి భోజనానికి కూర్చున్నాం . ఇద్దరికి ఆకలి లేక ముద్ద దిగక ఇబ్బంది పడుతుంటే  అమ్మమ్మ అడిగింది ఏంటి అన్నాలు సరిగా తినడంలేదు అని. ఎలాగోలా కానిచ్చి 2 గం.లకి స్కూలుకి వెళ్ళిపోయేము. అన్నం సరిగ్గా తినక స్కూల్లో ఆకలి. స్కూలయ్యేక మిగిలిన పావలాతో కోవా బిళ్ళలు కొనుక్కొని తిన్నాము. కొన్నాళ్ళ తర్వాత ప్రేంబాబు తోడయ్యేడు. కొన్నిటికి తీసుకెళ్ళేవాళ్ళం, కొన్నిటికి లేదు. ఎందుకంటే మా క్లాసు కాదు, మా కబుర్లు వేరు. వాడు చిన్నవాడనిపించేవాడు.
      ఇంట్లోకూడా అంతా జోకులు, పెద్దమామ హ్యూమర్ !! కన్నమామ అల్లరి. పిల్లలంతా కలిసి పెరట్లో ఆటలు. పనివాళ్ళు ... ధాన్యం దంపే  రామి, పాలు పితికే దాలప్పడు.
    అన్న (మా తాత గార్ని 'అన్న' అని ఆయన తమ్ముడు పిలిచే వారు. అదే మాకు అలవాటు అయ్యింది) టూత్ పేస్ట్ (యుతేమాల్ - గులాబీ రంగులో ఉండేది) పొట్టి సత్యం కొట్లోనే తెమ్మనేవారు.మధ్యాహ్నం ఎవరూ లేకుండా చూసి అన్న గదిలో టూత్ పేస్ట్ కొంచెం తీసుకొని నాకే వాళ్ళం. పెద్ద బజారు, చిన్నబజారు, భజనకోవెల ... ఇలా పల్లెటూరి వాతావరణం. మేము ఢిల్లీ  వేళ్ళేక వస్తే మమ్మల్ని చూసి 'పంతులుగారింటికా ?' అని అడిగేవారు.
        ప్రతీ పనికీ ... అంటే ... ప్రతీ పురుటి నొప్పులకి మాయిద్దరితో  మిడ్ వైఫ్ సారమ్మకి పిలుపుడా.రాయ్  గారింటికి పండ పిండివంటలు పని మనిషి చేత పట్టించుకెళ్ళటం. పిల్లలు పుట్టేక మనవాళ్ళందరికి చెప్పమనేవారు. ఎంతమంది గురించి చెప్పినా ఒక వ్యక్తిని గురించి మాత్రం మర్చిపోకుండా చెప్పాలి. అతను ఇంట్లో పిల్లలందరికి చిన్న క్లాసు ప్రవేట్ మాస్టారు, కోమటి, పేరు వాసుదేవరావు అనుకుంటా. అందరికి పునాది ఆ మాస్టారే. తెలుగులో డిక్టేషన్ పదాలు  " ధైర్యస్థైర్యములు" . సంస్కృత శబ్దం.  ఈ రెండూ అందరికీ చెప్పేవాడు. అందరికి ఆయనే పెర్మనెంట్ మాస్టారు .
           అమ్మమ్మతో నాకు, నాన్నకు వున్న దగ్గరతనం - అమ్మమ్మకి చెరు వైపులా కూర్చొని రామాయణ భారతాలు వింటూ  సినీమాలు చూసేక ఇంట్లో మేము బాణాలు కత్తియుద్ధాలు చేసుకోటం, circus చూస్తే పిట్టగోడ పైన నడచి సర్కసు, చెట్లు ఎక్కటం. అంతింట్లో ఏం అల్లరిచేసినా  ఎవరికీ తెలీదుఎక్కడికెళ్ళినా 'ఇద్దరం మనిద్దరం' అన్నట్లు నాలుగవ క్లాసు నుండి క్లాసుమేట్లం. అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నవి కోటి . ఉదాహరణకు  "నాది అనేది లేదు, మనది" అనాలి అనేది. అందులోనే అన్ని అర్థాలు. అలాగే మేమిద్దరం యింట్లో పెద్దవాళ్ళవటం వలన అన్ని భాధ్యతలకీ తలవంచి డెబ్బై
అయిదు సంవత్సరాలు అయినాయి. నా అత్తవారు విశాఖ అయితే నాన్న కూడ విశాఖే. అందుకే తరచు కల్సుకొని జ్ఞాపకాలు తాజా చేసుకుంటాము.
              ఇలా అన్నిరకాల జ్ఞాపకాలతో మళ్ళీ చిన్ననాటి రోజుల్లోకి వెళ్తున్నాను. నాన్నా ... నిన్ను కూడ నాతో తీసుకెళ్తున్నాను. వస్తావా ?  
                          అహ్ అహ్ అహ్ హా. !!
         ఇలా ఎండ్ లేదని అన్నట్లుండేవి మా చిన్ననాటి ముచ్చట్లు.

nAnna (gOviMdarAvu) tO cinnanATi j~jApakAlu


 gAde gOviMda rAvu  mA cinnakkamma koDuku. mA iMTlO mEnattalani, pedda ADa paDuculalO koMdarini 'akkamma' ani pilicE saMpradAyaM vuMdi. AlreDI appaTikE oka akkamma vuMDaDaMtO mA amma akkani 'cinnakkamma' ani pilicE vALLaM. alA tanu mA peddamma gAri koDuku. nAku pedda tammuDu. aMdaraM 'nAnna' ani pilustAM.
SrIkAkuLaMlOni mA ammamma gAriMTlO mEM kalisi perigina nATi  rOjulu - nijaMgA gOlDen DEs.
mA ammamma gArillu appaTi sinimAllO cUpiMcE palleTUru illu. adE ippuDu raMgullO cUpistE 'AhA OhO' aMTAmu.
            InADu enni cUsinA - annI cUsEsinA - dibbaroTTi nuMci pijjA varaku, ceppululEni kALLatO maTTilO parugulunuMci Esi kArlu, plEnlu varaku Edi anuBaviMcinA AnATi mA j~jApakAlaku sATi rAvu.
kAnI anADu ... !?
        rOjU yiMTlO sarukulu, kUralu tEvaTaM, nILLu nUtilOMci tODukoni snAnaM cEyaTaM, jAMceTTu ekki kAyalu kOsukoni ceTTumIda kUrconi tinaTaM . gaDDikuppa ekki jAraTaM, usirikAyalni uppu addukoni tinaTaM ...
     skUlunuMci rAgAnE ammamma pillalaMdakI talA kANI iccEdi. EdannA konukkoni tinaTaM, kANIki cerukumukka, peddarasku, kobbaruMDa, cinna jaMtika ilA vaccEvi.
    ivikAka yiMTlO kadha, kAryaM vaccinapuDu - BOjanAlu lETayyEvi. aMdukani pillalaki cinnavaMTa, iMguvacAru, pesarapappu^^annaM . adI kudarakapOtE taravANI annaM, vAmu, AvakAya, veMkaTApuraM mirapapaLLu AreMjiraMgulO uMDEvi, cidupukoni nUne vEsukoni annaM kalipi tiMTE A pulupu, kAraM abba ... ippuDu nOTilO nILLUrutunnAyi ! mAku ivi peTTi mAcEta peddavALLu hoTal nuMDi iDlIlu, dOselu teppiMcukoni tinEvAru. mAkU tinAlanuMDEdi. aDugutE cinnapillalu ivi tiMTE jabbu cEstuMdi anEvALLu. aMtE gup cap !
      ivikAka, erakayya koTlO eMDAkAlaM palcani majjigatETalO uppu, dabbAku, nimmarasaM, cinna mirapakAya vEsi aNAku ammEvADu, adi konukkoni cerisagaM silvar (veMDikAdu) glAsulO  tAgEvALLaM. pakODIla poTlaM arthaNA. aMdarikI teccEvALLaM. aMdari pillallAgE konni mastI (cilipi) panlu cEsEvALLaM. barATaM vIdhilO satyaM koTTu. eduru vIdhilO (sAnivIdhi anE vALLu) nArAyaNasvAmi kOmaTi koTTuMDEdi. nArAyaNasvAmi mahA pInAsi ..  musalivADu .. voMgipOyi cinna paMce kaTTukoni uMDEvADu. EmEnA koMTE A rOjullO sOla, tavva, aDda, kuMcaM. aMdulO lekkapeTTETappuDu okaTi anEvADukAdu. lABaM, reDDu (reMDu palikEdikAdu) mUDu anEvADu. OsAri EvO koni mAku vApasu ivvavalasina Dabbu kanna okarUpAya ekkuva iccEDu. iMka mAku pedda pennidhi , gAbarA, padisArlu lekkapeTTi rUpAyi kaMpas bAksulO dAcukoni migatAdi ammammakicci, marnADu skUlu ayyEka proddunna 11 gaM. ki A DabbulOMci mUDu pAvalAlu peTTi mikscaru, kalar sODA EdO konukkoni tinEsEM . iMTikocci snAnaM cEsi BOjanAniki kUrcunnAM . iddariki Akali lEka mudda digaka ibbaMdi paDutuMTE  ammamma aDigiMdi 'EMTi annAlu sarigA tinaDaMlEdu' ani. elAgOlA kAnicci 2 gaM.laki skUluki veLLipOyEmu. annaM sariggA tinaka skUllO Akali. skUlayyEka migilina pAvalAtO kOvA biLLalu konukkoni tinnAmu. konnALLa tarvAta prEMbAbu tODayyEDu. konniTiki tIsukeLLEvALLaM, konniTiki lEdu. eMdukaMTE mA klAsu kAdu, mA kaburlu vEru. vADu cinnavADanipiMcEvADu.
      iMTlOkUDA aMtA jOkulu, peddamAma hyUmar !! kannamAma allari. pillalaMtA kalisi peraTlO ATalu. panivALLu ... dhAnyaM daMpE  rAmi, pAlu pitikE dAlappaDu.
    anna (mA tAta gArni 'anna' ani Ayana tammuDu pilicE vAru. adE mAku alavATu ayyiMdi) TUt pEsT (yutEmAl - gulAbI raMgulO uMDEdi) poTTi satyaM koTlOnE temmanEvAru.madhyAhnaM evarU lEkuMDA cUsi anna gadilO TUt pEsT koMceM tIsukoni nAkE vALLaM. pedda bajAru, cinnabajAru, BajanakOvela ... ilA palleTUri vAtAvaraNaM. mEmu DhillI  vELLEka vastE mammalni cUsi 'paMtulugAriMTikA ?' ani aDigEvAru.
        pratI panikI ... aMTE ... pratI puruTi noppulaki mAyiddaritO  miD vaiP sArammaki pilupu, DA.rAy  gAriMTiki paMDaga piMDivaMTalu pani maniShi cEta paTTiMcukeLLaTaM. pillalu puTTEka manavALLaMdariki ceppamanEvAru. eMtamaMdi guriMci ceppinA oka vyaktini guriMci mAtraM marcipOkuMDA ceppAli. atanu iMTlO pillalaMdariki cinna klAsu pravET mAsTAru, kOmaTi, pEru vAsudEvarAvu anukuMTA. aMdariki punAdi A mAsTArE. telugulO DikTEShan padAlu  " dhairyasthairyamulu" . saMskRuta SabdaM.  I reMDU aMdarikI ceppEvADu. aMdariki AyanE permaneMT mAsTAru .
           ammammatO nAku, nAnnaku vunna daggaratanaM - ammammaki ceru vaipulA kUrconi rAmAyaNa BAratAlu viMTU A sinImAlu cUsEka iMTlO mEmu bANAlu kattiyuddhAlu cEsukOTaM, circus cUstE piTTagODa paina naDaci sarkasu, ceTlu ekkaTaM. aMtiMTlO EM allaricEsinA  evarikI telIdu. ekkaDikeLLinA 'iddaraM maniddaraM' annaTlu nAlugava klAsu nuMDi klAsumETlaM. ammamma daggara nErcukunnavi kOTi . udAharaNaku  "nAdi anEdi lEdu, manadi" anAli anEdi. aMdulOnE anni arthAlu. alAgE mEmiddaraM yiMTlO peddavALLavaTaM valana anni BAdhyatalakI talavaMci Debbai
ayidu saMvatsarAlu ayinAyi. nA attavAru viSAKa ayitE nAnna kUDa viSAKE. aMdukE taracu kalsukoni j~jApakAlu tAjA cEsukuMTAmu.
              ilA annirakAla j~jApakAlatO maLLI cinnanATi rOjullOki veLtunnAnu. nAnnA ... ninnu kUDa nAtO tIsukeLtunnAnu. vastAvA ?
                          ah ah ah hA. !!

         ilA eMD lEdani annaTluMDEvi mA cinnanATi muccaTlu.

12 comments:

  1. సుగుణక్కా !
    నీ రాతల్లో చదివింపజేసే గుణం చాలా వుంది. అందుకే గతం లోకి టైమ్ మిషన్ లా అవలీలగా తీసుకువెళ్ళి పోయావ్. దయచేసి ఆగకు. ఈ రచనా వ్యాసంగాన్ని ఆపకు. ముందు తరాల వారికి పనికొచ్చే విషయాలు ఏవైనా రావొచ్చు. అదీకాక ఎన్నో జానపద గీతాలు నీకు నోటి మీదే వుంటాయి. అవన్నీ భవిష్యత్ తరాల వారికి అవసరం. అందుకే నీ జ్టాపకాల వ్యాపకం - నీకు కాలక్షేపం - ముందు తరాల వారికి ఓ నిధి నిక్షేపం.
    రాజా

    ReplyDelete
  2. Maa kallaki kattinattugaa raaseru. Bapu cinema choostunnattu anipinchindi. Thanks for sharing.

    ReplyDelete
  3. Sugunakka, Your writing style is excellent. Thanks for taking us into the past and sharing your memories with us.

    ReplyDelete
  4. I imagined excellent journey in time machine and saw everything in black and white :) Want to read more Aunty... Please keep posting more :)

    ReplyDelete
  5. chalaa baaga raasevu.Nuvvu inka inka raayali.Srikakulam kallaki kattinattu baaga raasevu.Paata jnapakkalu gurtukostunnayi.
    jaanapada geetaalu raayi.Enno paatalu neeku vachunu!
    Prembabu

    ReplyDelete
  6. Sugunakka,
    Continue cheyyi. Maro "Nalonenu' lagano, maro "Oohaganam" (Lata) leka your own autobiography avvachchu. Very Naustalgic.

    ReplyDelete
  7. Namasthey auntie.....
    chaduvutuntey inka chadavalani undii.....Chala bavunnayii me chinna nati gnapakalu...pls continue ur postings....

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. చిన్ననాటి జ్ఞాపకాలని ఇంత మృదు మధురంగా చెప్తున్నమీరు వ్రాయకుండా ఆపివేయటం భావ్యమా? చక్కని శైలి లో... అప్పటి రోజుల్లోకి తీసుకువెళ్లిపోయారు... ఇంకా వ్రాయండి అక్కయ్యా...ప్లీజ్.... మమ్మల్ని డిజప్పాయింట్ చేయరు కదూ?

    ReplyDelete
  10. అప్పటి పునాది అంత గట్టిగా వుంది కాబట్టే ఇప్పటివాళ్ళు మేడలు కట్టగలుగుతున్నారు. చాలా బాగా చెప్పారండీ.

    ReplyDelete
  11. నా చిన్నతనం...మా వూరూ గుర్తుకొచ్చాయి...కళ్ళక్కట్టినట్టుగా ఉంది-
    రామజోగయ్య శాస్త్రి

    ReplyDelete
  12. హాయ్ సుగుణక్కా , చిన్న నాటి చిలిపి పాటలు దంచి పారీసేవు . బలే మజా వచ్చింది . ఇవన్ని నాకు కూడా గుర్తే ..గురుమూర్తి కదా వాడి పేరు?
    ఇంకొక పాట కూడా పెట్టు . గోదావరి పుష్కరాల వింతలు ...! ఈ బ్లాగు ఇలాగే కంటిన్యు చెయ్యి. చాల బావున్నాయి .

    లీల

    ReplyDelete